మన తెలంగాణ/హైదరాబాద్: మంగళవారం అర్థరాత్రి నుండి ఆర్‌టిసి కార్మికులు సమ్మెకు దిగారు. సమ్మె నివారణకోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అధికారుల కమిటీతో కార్మిక సంఘాల నాయకులు నాలుగు గంటలకు పై గా జరిపిన చర్చలు ఫలించకపోవడంతో సమ్మె కు వెళుతున్నట్లు జెఎసి నేతలు ప్రకటించారు. దీంతో మంగళవారుం అర్థరాత్రి నుంచి బస్సు లు డిపోలకే పరిమితం కానున్నాయి. సమ్మె ని వారణకు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఐఎఎస్ అధికారుల కమిటీ (వికాస్ రాజ్, సందీఫ్ కుమార్ సుల్తానియా, ఆర్‌టిసి ఎండి నాగిరె డ్డి,) సచివాలయంలో కార్మిక సంఘాల జెఎసి నేతలతో చర్చలు జరిపింది. కాగా జెఎసి తరఫున ఈదురు వెంకన్న, థామస్ రెడ్డి, హనుమంతు ముదిరాజ్ ఈ చర్చల్లో పాల్గొన్నారు. సమ్మెనోటీసు ఇచ్చి 41 రోజులు గడిచినప్పటికీ ఇంతకాలం నిర్లక్షం చేసి గడువు ముగిసే చి వరి రోజు అధికారుల కమిటీ ఏర్పాటు చేశార ని జెఎసి నేతలు విమర్శించారు. ప్రభుత్వంలో ఆర్‌టిసి విలీనం, కార్మిక సంఘాల గుర్తింపు తమ ప్రధాన డిమాండ్ అని వారు పేర్కొన్నా రు.

కార్మిక సంఘాలు, ప్రభుత్వం వద్ద 32 డి మాండ్లు పెట్టినప్పటికీ ప్రధాన మైన డిమాండ్ల పై సయోధ్య కుదురకపోవడంతో సమ్మెను కొ నసాగించి తీరుతామని ఆర్‌టిసి జెఎసి నేతలు ప్రకటించారు. చర్చల పేరుతో కాలయాపన తప్ప తమ డిమాండ్లు పరిష్కరించాలన్న చిత్తశు ద్ది ప్రభుత్వానికి లేదని కూడా వారు విమర్శించారు. తమకు గత్యంతరం లేకనే సమ్మెకు దిగకతప్పడం లేదని జెఎసి చైర్మన్ ఈదురు వెంక న్న ఆవేదన వ్యక్తం చేశారు. తమ డిమాండ్లు ఏవీ కొత్తగా పుట్టుకొచ్చినవి కావని, గతంలో ఉ న్నవని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ తమ మెనిఫెస్టోలో ఇచ్చిన హామీలే తమ డిమాండ్లని ఆర్‌టిసి జెఎసి వైస్ చైర్మన్ థామస్ రెడ్డి స్పష్టం చేశారు. ఆర్‌టిసిలో గత 7 సంవత్సరాలుగా కార్మికుల సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదని ఎన్నిసార్లు ప్రభుత్వానికి వినతిపత్రాలు ఇచ్చినా స్పందన లేదని జెఎసి నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఒకపక్కన ఎలక్ట్రిక్ బస్సుల కోసం ఆర్‌టిసి స్థలాలను ప్రైవేట్ యాజమాన్యానికి తాకట్టు పెడుతోందని విమర్శించారు.


గ్రేటర్ హైదరాబాద్ జోనలో ఉన్న కార్మికులను కరీంనగర్, హైదరాబాద్ జోన్లకు బదిలీలు చేసే ప్రక్రియ చేపడుతూనే మరోప్రక్క మల్టీ ట్రేడ్ సిస్టమ్ ని తీసుకువచ్చి ఆర్‌టిసి కార్మికులను అణగదొక్కే ప్రయత్నం చేస్తోందని జాయింట్ యాక్షన్ కమిటి అటు ప్రభుత్వ, యాజమాన్యాలపై విరుచుకుపడింది. జాయిoట్ యాక్షన్ కమిటీ సమ్మె నోటీసు ఇచ్చిన కారణంగా, లేని సమస్యలను కార్మికుల ముందుకు తీసుకువచ్చి, కార్మికుల మనస్థైర్యాన్ని దెబ్బ తీసేవిధంగా ప్రభుత్వ, యాజమాన్యాలు మైండ్ గేమ్ ఆడుతున్నాయని జెఎసి నేతలు ధ్వజమెత్తారు. వారు ఆడుతున్న మైండ్ గేమ్ ని కార్మికవర్గం తిప్పికొట్టి గేమ్ ఛేంజర్ అవుతుందని వారు హెచ్చరించారు. ఆర్‌టిసి ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయటం, ట్రేడ్ యూనియన్లను పునరుద్దరించడం, వేతన సవరణలు జరపడం, తదితర 32 డిమాండ్లను జాయింట్ యాక్షన్ కమిటీ ప్రభుత్వం ముందుంచింది. ఇదిలా ఉండగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్‌టిసి కార్మికులు సమ్మెకు దిగడం ఇదే తొలిసారి. గత బిఆర్‌ఎస్ ప్రభుత్వ హాయంలో ఆర్‌టిసి సమ్మె 55 రోజులకు పైగా కొనసాగిన విషయం తెలిసిందే.