భారత విమానాలపై గగనతల దిగ్బంధనం మే 24 వరకు పొడిగిస్తూ పాకిస్థాన్ మంగళవారం నిర్ణయం తీసుకుంది. గత ఏడాది ఏప్రిల్ 22న కశ్మీర్ లోని పహల్గాంపై ఉగ్రదాడి జరిగి 26 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఆ తరువాత ఏప్రిల్ 24 నుంచి రెండు దేశాల మధ్య గగనతల దిగ్బంధనం కొనసాగుతోంది. గత ఏడాది ఏప్రిల్ 30 నుంచి పాకిస్థాన్ విమానాలకు భారత గగనతలాన్ని వినియోగించడానికి అనుమతి లేదు. పాకిస్థాన్ ఎయిర్‌పోర్ట్ అథారిటీ నోటమ్ ప్రకారం ఈ ఏడాది మే 24 ఉదయం 5 గంటల వరకు ఆంక్షలు కొనసాగుతాయి. దీనివల్ల పశ్చిమదేశాలకు , ముఖ్యంగా గల్ఫ్ దేశాలకు, యూరప్ దేశాలకు ఢిల్లీ, అమృత్‌సర్, జైపూర్ నుండి వెళ్లే సుమారు 800 వారపు విమాన సర్వీసులపై ప్రభావం పడుతుంది.