లక్నో: 17 ఏళ్ల విద్యారిపై ఓ మహిళ లైంగికగా దాడి చేసిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లక్నోలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... 17 ఏళ్ల బాలుడు తన స్నేహితుడు ఇంటికి వెళ్లేవాడు. ఫిబ్రవరి 17 నుంచి బాలుడు కనిపించకపోవడంతో ఆమె అతడి స్నేహితులను ప్రశ్నించింది. ఒక స్నేహితుడి ఇంటికి పలుమార్లు వెళ్లాడని చెప్పడంతో అతడి దగ్గరికి వెళ్లాడు. తన వదినతో కలిసి అతడు వెళ్లిపోయాడని చెప్పడంతో తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. మార్గం మధ్యలో ఫోన్ సిమ్ తీసేసి బయట పారేసింది. సదరు మహిళ బాలుడిని తీసుకొని నైనిటాల్ కు తీసుకెళ్లింది. అక్కడి ఓ హోటల్ రూమ్ లో బాలుడిపై లైంగిక దాడికి పాల్పడడంతో పాటు వీడియోలు, ఫొటోలు తీసింది. పది లక్షలు రూపాయలు ఇవ్వకుంటే ఫొటోలు, వీడియోలను వైరల్ చేస్తానని బాలుడిని బెదిరించింది. పోలీసులు విచారణ చేసి వాళ్లు ఆచూకీ కనిపెట్టారు. బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించి నిందితురాలును అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.