
ప్రపంచవ్యాప్తంగా భారీ క్రేజ్ ఉన్న మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్... కెజిఎఫ్ సిరీస్, సలార్ లాంటి సెన్సేషనల్ హిట్స్ ఇచ్చిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో భారీ యాక్షన్ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రాన్ని తాత్కాలికంగా ‘ఎన్టీఆర్ నీల్’ మూవీ అని పిలుస్తున్నారు. ఈ సినిమాపై ఇటు ఫ్యాన్స్, అటు ఇండస్ట్రీ వర్గాల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న ఈ ప్రాజెక్ట్ షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. తాజాగా మేకర్స్ ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్, రిలీజ్ డేట్ గురించి వివరాలను తెలియజేశారు. ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్‌ను మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేయబోతున్నారు.
ఈ గ్లింప్స్ ఒక పవర్‌ఫుల్ సినిమాటిక్ వరల్డ్‌ను పరిచయం చేస్తుందని మేకర్స్ చెబుతున్నారు. ఇక ఈ సినిమా జూన్ 11, 2027న శుక్రవారం థియేటర్లలోకి రానుంది. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్‌లో ఎన్టీఆర్ నీడలాంటి ఓ లుక్‌లో కనిపిస్తున్నారు. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ సహా పలు భాషల్లో ఈ మూవీ విడుదల కాబోతోంది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్ బ్యానర్‌లో కల్యాణ్ రామ్ నందమూరి, నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు నిర్మిస్తున్నారు.













