
హైదరాబాద్: గత ప్రభుత్వం కల్యాణలక్ష్మి చెక్కులను వివాహమైన రెండేళ్లకు ఇచ్చేదని మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. గత ప్రభుత్వం తెచ్చిన పథకాన్ని సదుద్దేశంతో కొనసాగించామని అన్నారు. ఈ సందర్భంగా సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం 3 నెలల్లోపు కళ్యాణలక్ష్మి చెక్కులు ఇచ్చిందని, రైతు భరోసాను రూ. 12 వేలకు పెంచి కొనసాగించామని శ్రీహరి తెలియజేశారు. కోర్టు స్టే వల్ల చిన్నకల్యాణలక్ష్మిపథకానికి అవాంతరం వస్తే ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని విమర్శించారు. కోర్టు వివరణ అడిగినంత మాత్రాన.. పథకాలు నిలిచిపోవని వాకిటి శ్రీహరి సూచించారు.











