
కేరళలో సీపీఎం నేతృత్వంలోని అధికార ఎల్‌డీఎఫ్‌కు ఈసారి గట్టి షాక్ తగలనుంది. విజయన్ నేతృత్వంలో రెండుసార్లు అధికారంలోకి వచ్చిన కూటమికి ఈసారి ఎన్నికల్లో ఎదురుగాలి తప్పదని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ సంస్థలు అంచనా వేశాయి. కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్‌కు ఈసారి ఓటర్లు పట్టం కట్టనున్నట్లు అభిప్రాయపడ్డాయి. భాజపా ఈసారి ఎన్నికల్లో ఖాతా తెరిచే అవకాశం ఉందని అంచనా వేస్తున్నాయి. కేరళలో 140 స్థానాలకు గాను ఏప్రిల్ 9న పోలింగ్ జరిగింది. ఎల్‌డీఎఫ్, యూడీఎఫ్ మధ్యే ప్రధాన పోరు సాగింది.
సాధారణంగా కేరళలో ఐదేళ్లకోసారి అధికార మార్పిడి జరుగుతూ వస్తోంది. కానీ, 2021 ఎన్నికల్లో ఎల్‌డీఎఫ్ రెండోసారి అధికారంలోకి వచ్చింది. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో యూడీఎఫ్ సత్తా చాటింది. అవే ఫలితాలు అసెంబ్లీ ఎన్నికల్లోనూ ప్రతిఫలించనున్నాయని సర్వే సంస్థలు పేర్కొంటున్నాయి.
యాక్సిస్ మై ఇండియా సర్వే ప్రకారం యూడీఎఫ్ 7890, ఎల్‌డీఎఫ్ 4962, భాజపా03 స్థానాలను గెలుచుకుంటాయని అంచనా. పీపుల్స్పల్స్ సర్వే ప్రకారం యూడీఎఫ్ 7585, ఎల్‌డీఎఫ్ 5565, భాజపా 03 స్థానాలను గెలుచుకుంటాయని అంచనా. ఓట్‌వైబ్ సర్వే ప్రకారం యూడీఎఫ్ 7080, ఎల్‌డీఎఫ్ 5868, భాజపా 04 స్థానాలను గెలుచుకుంటాయని అంచనా. పీపుల్స్ ఇన్‌సైట్ సర్వే ప్రకారం యూడీఎఫ్ 6676, ఎల్‌డీఎఫ్ 5868, భాజపా 1014, ఇతరులు 01 స్థానాలను గెలుచుకుంటాయని అంచనా.












