వరంగల్: ప్రేమజంటపై దాడి చేసి డబ్బులు లాక్కున్న ముగ్గురిని పోలీసులు అరెస్టు చేసిన సంఘటన వరంగల్ జిల్లా రంగశాయి పేట మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... మిల్స్‌కాలనీలోని ఉర్సుగుట్ట ప్రాంతంలోని నిర్మానుష్య ప్రదేశంలో ఓ జంట ఏకాంతంగా గడుపుతున్నారు. పవన్ సింగ్, రవీందర్ సింగ్, సికందర్ సింగ్ అనే ముగ్గురు ప్రేమ జంటను చుట్టముట్టడంతో ఫొటోలు, వీడియోలు తీశరాఉ. అనంతరం వీడియోలను యువతి తల్లిదండ్రులకు పంపుతామని బెదిరించడంతో పాటు బంగారం, వెండి ౠబరణాలు లాక్కున్నారు. అనంతరం లవర్ ముందే యువతితో అసభ్యంగా ప్రవర్తించారు. వరంగల్‌లో సదరు యువకులు అమ్ముతుండగా వారిని పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి బంగారు, వెండి ఆభరణాలు, మూడు ఫోన్లు, ద్విచక్రవాహనం స్వాధీనం చేసుకొని వారిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితులు కాజీపేటకు చెందిన వారని పోలీసులు వెల్లడించారు.