శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతం నుండి వరద ఉధృతి పెరగడంతో ప్రాజెక్టుకు చెందిన 30 గేట్లను గురువారం రాత్రి పది గంటలకు నుండి నీటిని విడుదల చేశారు. 30 గేట్ల నుండి 449139 క్యూసిక్ ల నీటిని  వదిలారు. ఎల్లంపల్లి ప్రాజెక్ట్ 20 టీఎంసీల కెపాసిటీ కాగా కడెం ప్రాజెక్టు నుండి 260079 క్యూసెక్కుల నీటితో పాటు ఎగువ ప్రాంతం నుండి 308876 క్యూసెక్కుల నీరు రావడంతో 30 గేట్లను ఎత్తి 449130 క్యూసెక్కుల దిగువ ప్రాంతానికి వదులుతున్నారు. నీటిని వదలడంతో దిగువ ప్రాంతంలోని రైతులను అప్రమత్తం చేశారు.