ఢిల్లీ: పుస్తకం తెచ్చుకోలేదని టీచర్ ఎండలో నిలబెట్టడంతో విద్యార్థిని మృతి చెందిన సంఘటన ఢిల్లీలోని తూర్పు వినోద్ నగర్‌లో జరిగింది. విద్యార్థిని తల్లి అంజలి తెలిపిన వివరాల ప్రకారం... ఆగస్టు 27న తన కూతురు తనకు ఫోన్ వచ్చింది. అక్కడికి వెళ్లేసరికి తన కూతురు ఎండలో నిల్చొని ఉండడంతో పాటు అప్పటికే ఆమె ఆరోగ్యం బాగా క్షీణించి స్పృహతప్పి పడిపోయింది. వెంటనే తన కూతురును ఆస్పత్రికి తరలించామని, చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. పుస్తకం తెచ్చుకోనందుకు పాపను ఎండలో నిలబెట్టారని తల్లి అంజలి ఆరోపణలు చేసింది. ఈ ఘటనపై ఢిల్లీ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.