నవతెలంగాణ – హైదరాబాద్ : తెలంగాణలో ఎండలు తీవ్రరూపం దాల్చాయి. పెద్దపల్లిలో గరిష్టంగా 46.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో పెద్దపల్లి, కరీంనగర్, ఖమ్మం, నల్గొండ, ఆదిలాబాద్, మంచిర్యాల సహా 23 జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. మరో పది జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. వచ్చే 3-4 రోజులు ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. అత్యవసరం అయితే తప్ప మధ్యాహ్నం బయటకు రావద్దని సూచించారు.
The post ఎండలు తీవ్రరూపం..23 జిల్లాలకు రెడ్ అలర్ట్ appeared first on Navatelangana.













