నవతెలంగాణ-మద్నూర్జహీరాబాద్ ఎంపీ సురేష్ సెట్కార్ కు సర్పంచ్ మాధవరావు శాలువతో ఘనంగా సత్కరించారు. ఎంపీ మద్నూర్ మండలాన్ని సందర్శించి మండలంలోని మూడు రాష్ట్రాల సరిహద్దులో గల సలాబత్పూర్ ఆంజనేయ స్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ క్రమంలో సర్పంచ్ నేరుగా ఆలయానికి చేరుకుని ఎంపీని కలిశారు. అదేవిధంగా ప్రత్యేకంగా సన్మానించారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ.. గ్రామంలోని సమస్యలను తమ దృష్టికి తీసుకొస్తే, పరిష్కరిస్తానని, గ్రామాభివృద్ధికి సహకరిస్తానని హామీ ఇచ్చారు.
The post ఎంపీ సురేష్ షెట్కార్ కు సర్పంచ్ సన్మానం appeared first on Navatelangana.












