‘గాడ్ ఆఫ్ మాసెస్’ నందమూరి బాలకృష్ణ.. బ్లాక్‌బస్టర్ దర్శకుడు గోపీచంద్ మలినేనితో కలిసి అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారీ యాక్షన్ చిత్రం ‘ఎన్‌బికె 111’ కోసం మరోసారి జతకట్టారు. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీశ్ కిలారు భారీ స్థాయిలో నిర్మిస్తు న్న ఈ చిత్రం, యాక్షన్, ఎమోషన్స్, అద్భుతమైన సన్నివేశాల కలయికతో ప్రేక్షకులను అలరించనుంది. ప్రస్తు తం ఈ చిత్రం ప్రొడక్షన్ పనులు శర వేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రా న్ని డిసెంబర్ 24న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో మనోజ్ మంచు ఓ పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నారు. భారీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించనుంది.