
ఎపి హైకోర్టు తొలి మహిళా సిజెగా జస్టిస్ లీసా గిల్ శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. లోక్‌భవన్‌లో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఆమెతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ ఉన్నత స్థాయి అధికారులు హాజరయ్యారు. జస్టిస్ లీసా గిల్‌కు న్యాయవ్య వస్థలో 35 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం ఉంది. మాజీ న్యాయమూర్తి జస్టిస్ హర్పూల్ సింగ్ బ్రార్ కుమార్తైన జస్టిస్ లీసా గిల్ నవంబర్ 17, 1966 న చండీగఢ్‌లో జన్మించారు. పంజాబ్ విశ్వవిద్యాలయం నుంచి బీఏ-ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం పూర్తి చేశారు. 1990లో న్యాయ వాదిగా నమోదు చేసుకుని, పంజాబ్-హరియాణా హైకోర్టులో ప్రాక్టీస్ మొదలుపెట్టారు. 24 ఏళ్ల పాటు సివిల్, క్రిమినల్, రెవెన్యూ విభాగాలలకు సంబంధించిన కేసులు వాదించారు.
ఆపై చండీగఢ్ కేంద్రపాలిత ప్రాంతానికి సుదీర్ఘకాలం ప్రభుత్వ న్యాయవాదిగా, పలు బోర్డులు, కార్పొరేషన్లకు ప్రతినిధిగా పనిచేశారు. 2014 మార్చి 31న పంజాబ్-హరియాణా హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఇప్పటివరకు తన కెరీర్‌లో ఎన్నో సంచలన తీర్పులను జస్టిస్ లీసా గిల్ వెలువరించారు. సుప్రీంకోర్టు కొలీజియం ’అడ్వాన్స్ ట్రాన్స్‌ఫర్’ పాలసీలో భాగంగా ఈ ఏడాది మార్చిలోనే ఎపి హైకోర్టు కు బదిలీపై వచ్చారు. 2028 నవంబర్ 16 వరకూ ఎపి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగుతారు. హైకోర్టు సిజె జస్టిస్ లిసా గిల్‌కు సిఎం చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ముందే అభినందనలు తెలిపారు. మర్యాదపూర్వకంగా సమావేశమై పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు.












