ఎపిలో పోగాకు రైతులు మరోసారి రోడ్డెక్కారు. వర్జీనియా పొగాకుకు గిట్టుబాటు ధర ఇవ్వాలని ప్రకాశం జిల్లా రైతులు రహదారిపైకి వచ్చి నిరసన తెలిపారు. ముదిగొండ బ్రిడ్జి, టంగటూరు టోల్ గేట్ వద్ద హైవేను దిగ్భంధించారు. టోల్ ప్లాజా వద్ద రైతులు పొగాకు రైతులు, రైతు సంఘాల నాయకులు.. సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై బైఠాయించారు. దీంతో రహదారికి ఇరువైపులా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. రైతుల అకస్మిక ఆందోళన, రాస్తారోకోతో జాతీయ రహదారిపై గంటల తరబడి రవాణా వ్యవస్థ పూర్తిగా స్థంభించిపోయింది. రైతుల ఆందోళన నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. ప్రభుత్వం తమ డిమాండ్లపై స్పందించాలని రైతులు కోరుతున్నారు.