
న్యూఢిల్లీ: నీట్ పరీక్ష పత్రం లీకేజీ వ్యవహారంపై ఆందోళనలు ఉద్ధృతమైన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు ముమ్మరం చేసింది. చర్చలకు రావాలని విద్యార్థులు, కాక్రోచ్ జనతా పార్టీ(సిజెపి) నేతలను మరోసారి ఆహ్వానించింది. ‘మీకు అనుకూలంగా ఉండే సమయంలో ఎప్పుడైనా చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది’ అని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు.
‘‘ఆందోళనకారులకు కేంద్రం నాలుగు ప్రతిపాదనలు చేసింది. వాటిపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఆందోళనకారుల తరఫున కొందరు వచ్చి ప్రభుత్వంతో చర్చించవచ్చు. మీరు ఎప్పుడైనా రావొచ్చు. ప్రభుత్వం తరఫున నేను, జెపి నడ్డా చర్చల్లో పాల్గొంటాం’’ అని జితేంద్ర సింగ్ పిలుపునిచ్చారు. నడ్డా కార్యాలయంలో కానీ, ఆయన నివాసంలో కానీ చర్చిద్దామని న్నారు. తొలుత చర్చ ప్రారంభిస్తేక్ర.క్రమంగా పరిష్కరం లభిస్తుందన్నారు. విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని అందకు అనుగుణంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు.











