
బాధితుల నుంచి విద్యుత్ శాఖ ఏఈ లంచం తీసుకుంటూఎసిబికి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ సంఘటన బొల్లారం డివిజన్‌లో గురువారం చోటుచేసుకున్నది. మెదక్ ఎసిబి డిఎస్పి సుదర్శన్ తెలిపిన వివరాల ప్రకారం.. బొల్లారం విద్యుత్ శాఖ కార్యాలయంలో ఏఈగా రామకృష్ణారెడ్డి విధులు నిర్వర్తిస్తున్నాడు. ఇటీవల స్థానిక వైఎస్సార్ కాలనీలోని విద్యుత్ స్తంభం ప్రమాదంలో ధ్వంసమైన ఘటనలో ఓ వ్యక్తి నుంచి రూ.25 వేల లంచం డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఎసిబి అధికారులను ఆశ్రయించాడు. ఈ మేరకు గురువారం బాధితుడిని నుంచి ఏఈని లంచం తీసుకుంటుండగా ఎసిబి అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అధికారులెవరైనా లంచం కోసం వేధిస్తే ఎసిబికి ఫిర్యాదు చేయాలని, ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచుతామని అధికారులు పేర్కొన్నారు.












