గాలె: శ్రీలంక-భారత్ మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో భారత్‌కు ఎట్టకేలకు ఊరట లభించింది. ఈ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో భారత్, శ్రీలంకకు 372 పరుగుల విజయలక్ష్యాన్ని ముందుంచింది. ఈ లక్ష్య చేధనలో శ్రీలంక మరోసారి తడబడింది. 47 పరుగుల వద్దే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో ధనంజయ డి సెల్వ, సోనల్ దినుష జట్టును గట్టెక్కించే ప్రయత్నం చేశారు. ఇద్దరు కలిసి 95 పరుగుల భాగస్వామ్యాన్ని జత చేశారు. ఈ క్రమంలో ఇరువురు అర్థ శతకాలు సాధించారు. అయితే ఈ భాగస్వామ్యాన్ని రవీంద్ర జడేజా బ్రేక్ చేశాడు. జడేజా బౌలింగ్‌లో డి సెల్వ(59) మానవ్ సుతార్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం శ్రీలంక 57 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. క్రీజ్‌లో దినుష(53), డిక్వెలా(6) ఉన్నారు. విజయానికి శ్రీలంకకు ఇంకా 221 పరుగులు అవసరం ఉండగా.. భారత్‌ ఇంకా ఐదు వికెట్లు తీయాలి.