
భారతదేశంలోని ప్రైవేట్ టెలికాం సంస్థలు దేశంలోని చాలా ప్రాంతాలలో 5G సేవలను అందిస్తున్నాయి. తక్కువ ధరలో 5G సేవలను ఆస్వాదించాలనుకునేవారికి ఈ ప్లాన్ల ప్రారంభ ధర కంపెనీలను బట్టి ఉంటుంది. రిలయన్స్ జియో, ఎయిర్టెల్ వోడాఫోన్ ఐడియా కంపెనీలు డేటాతో, కాలింగ్ ప్రయోజనాలతో పాటు 5G యాక్సెస్‌ను అందించే ప్రీపెయిడ్ ప్లాన్లను అందిస్తున్నాయి. ఈ క్రమంలో మూడు ఆపరేటర్ల నుండి ప్రస్తుతం అందుబాటులో ఉన్న అత్యంత సరసమైన 5G ప్లాన్లను ఏదో ఇప్పుడు తెలుసుకుందాం.
ఎయిర్టెల్ అత్యంత చౌకైన 5G ప్లాన్
ఎయిర్టెల్ చౌకైన 5G ప్లాన్ ధర ర్.379. ఈ ప్లాన్ రోజుకు 2GB డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్, 100 SMSలను అందిస్తుంది. అంతేకాదు, అపరిమిత 5Gని కూడా అందిస్తుంది. కాకపోతే ప్రతి 30 రోజులకు గరిష్టంగా 300GB 5Gని మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది. ఈ ప్లాన్‌తో పాటు ఒక నెలకు 30GB గూగుల్ వన్ క్లౌడ్ స్టోరేజ్, ఆరు నెలల పాటు ఉచిత ఆపిల్ మ్యూజిక్ వంటి కొన్ని అదనపు ప్రయోజనాలు కూడా లభిస్తాయి.
వోడాఫోన్ ఐడియా 5G ప్లాన్
ఈ సంస్థ నుండి వచ్చిన ఈ రూ.349 రీఛార్జ్ ప్లాన్‌లో అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 SMSలు, రోజుకు 1.5GB డేటా లభిస్తాయి. ఈ ప్లాన్ సర్వీస్ వ్యాలిడిటీ 28 రోజులు! ఇది అపరిమిత 5Gని అందిస్తుంది. అయితే ప్రతి 28 రోజులకు 300GBకి పరిమితం చేయబడింది. అదనంగా బింజ్ ఆల్ నైట్, Vi మూవీస్ అండ్ టీవీ, వీకెండ్ డేటా రోల్ఓవర్, డేటా డిలైట్స్ వంటి ప్రయోజనాలు కూడా ఈ ప్లాన్‌తో పాటుగా వస్తాయి.
రిలయన్స్ జియో చౌకైన 5G ప్లాన్
రిలయన్స్ జియో తన అత్యంత చౌకైన 5G ప్లాన్‌ను కేవలం రూ.198కే అందిస్తోంది. ఈ ప్లాన్‌తో, వినియోగదారులకు రోజుకు 2GB డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్, 100 SMSలు లభిస్తాయి. ఈ ప్లాన్ సర్వీస్ వ్యాలిడిటీ కేవలం 14 రోజులు మాత్రమే. ప్రాథమిక ప్రయోజనాలలో జియోటీవీ, జియోఏఐక్లౌడ్కు డిఫాల్ట్ సబ్స్క్రిప్షన్లు ఉంటాయి. ఈ ప్లాన్‌తో అందించే అపరిమిత 5G డేటాపై ఎలాంటి క్యాపింగ్ లేదా పరిమితి లేదు.










