
హైదరాబాద్: ప్రియాంక మృతదేహానికి గాంధీ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి అనంతరం తల్లిదండ్రులకు మృతదేహాన్ని అప్పగించారు. సోమవారం సాయంత్రం గద్వాల జిల్లా ఐజ మండలం ఏక్లాస్‌పురంలో అంత్యక్రియలు జరగనున్నాయి. గాంధీ ఆస్పత్రిలో ప్రియాంక తండ్రిని మంత్రి వాకిటి శ్రీహరి, రాజమండ్రి ఎంఎల్ఎ శ్రీనివాస్ పరామర్శించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజమహేంద్రవరంలో మద్యం సేవించిన సూరావరపు దస్వంత్, ఆండ్రూ జోసఫ్ అడ్వర్ట్ అనే యువకులు వైద్యవిద్యార్థిని ప్రియాంకను కారుతో ఢీకొట్టిన విషయం తెలిసిందే. అనంతరం సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వైద్య విద్యార్థిని ప్రియాంక మృతి చెందారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.








