లండన్ : జైపూర్ రాజమాత,మహారాణి గాయత్రీదేవికి చెందిన అరుదైన 17వ శతాబ్దపు ఖగోళ కంప్యూటర్ వచ్చేవారం లండన్‌లో వేలానికి రానున్నది. లండన్‌లోని ప్రసిద్ధ సోద్బైస్ అనే వేలం సంస్థ ఈ కంప్యూటర్‌ను వేలం వేయనుంది. ఈ చారిత్రక పరికరం 1.5 నుంచి 2.5 మిలియన్ పౌండ్ల (సుమారు రూ. 15 కోట్ల నుండి రూ.25 కోట్లకు పైగా)పలికే అవకాశం ఉందని అంచనా.

1612లో లాహోర్‌లో మొఘల్ అధికారి కోసం ఈ కంప్యూటర్‌ను రూపొందించారు.17 వ శతాబ్దపు అత్యంత క్లిష్టమైన, పెద్ద ఖగోళ సాధనాల్లో ఒకటిగా దీన్ని పరిగణిస్తున్నారు. జైపూర్ మహారాజా సవాయ్ మాన్‌సింగ్, గాయత్రీదేవీల వ్యక్తిగత సేకరణలో ఇదొక భాగం. సమయాన్ని, నక్షత్రాల స్తానాలను, మక్కా దిశను కనుగొనడానికి దీన్ని ఉపయోగించేవారు.