
అమరావతి: ఐదేళ్లు మైనింగ్ వ్యవస్థను మాజీ సిఎం జగన్ మోహన్ రెడ్డి,ఆయన అనుచరులు నాశనం చేశారని ఎపి మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. మైనింగ్ రంగాన్ని దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దే లక్ష్యంతో పనిచేస్తున్నామని అన్నారు. అన్నమయ్య జిల్లాలో రవీంద్ర పర్యటన చేశారు. మదనపల్లి మండలం వలసపల్లిలో గ్రానైట్ క్వారీని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సహజవనరులను స్వార్థానికి దోచుకున్నారని విమర్శించారు. కూటమి అధికారం వచ్చాక అక్రమాలపై శ్వేతపత్రాలు విడుదల చేశామని,ఆదాయం, పర్యావరణ పరిరక్షణకు ప్రత్యేక ప్రాధాన్యం కల్పిస్తున్నామని కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.












