కామారెడ్డి: కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని దేవునిపల్లి గ్రామంలో ఓ కారులో గ్యాస్ నింపుతుండగా ఒక్కసారిగా ట్యాంకు పేలింది. ఈ ప్రమాదంలో కారు పక్కన పార్కింగ్‌లో ఉన్న మరో రెండు కార్లు, ద్విచక్రవాహనం కాలిపోయాయి. భారీ శబ్ధంతో పేలుడు సంభవించడంతో భయాందోళనకు గురైన స్థానికులు ఒక్కసారిగా అక్కడి నుంచి పరుగులు తీశారు. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.