కల్వకుర్తి: రాయచూర్-కోదాడ జాతీయ దారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం కల్వకుర్తి మండల పరిధిలోని సిబిఎం కళాశాల వద్ద కారు, ప్రైవేటు పాఠశాల బస్సు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ప్రభుత్వ వైద్యుడు విజయ్ కుమార్ (43) తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే అతడిని కల్వకుర్తి పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడికి భార్య యశ్వంత్ రాణి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. యశ్వంత్ రాణి కూడా వైద్యురాలిగా పని చేస్తున్నారు. విజయ్ కుమార్ మృతికి పలువురు వైద్యులు ప్రగాఢ సంతాపం తెలియజేశారు.