
హీరో కార్తి తమిళం, తెలుగు భాషల్లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన ‘సర్దార్’కి సీక్వెల్ ‘సర్దార్ 2’తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ప్రీక్వెల్‌కి దర్శకత్వం వహించిన పిఎస్ మిత్రన్ సర్దార్2 కి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రిన్స్ పిక్చర్స్, ఐవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ గ్రాండ్ గా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంలో మాళవిక మోహన్, ఆషికా రంగనాథ్, రజిషా విజయన్ ఫిమేల్ లీడ్స్ గా నటిస్తుండగా ఎస్ జె సూర్య ఓ పవర్ ఫుల్ పాత్రలో కనిపిస్తున్నారు. తాజాగా విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది. టీజర్ లో ’సర్దార్’ ప్రపంచాన్ని భారీ స్థాయిలో చూపించారు. విజువల్స్, యాక్షన్ సీన్స్ హాలీవుడ్ స్టైల్ ఫీల్‌ను తీసుకొస్తున్నాయి. కార్తి డబుల్ రోల్‌లో అదరగొట్టారు. మొత్తానికి, ’సర్దార్ 2’ టీజర్... ఇంటెన్స్ యాక్షన్, హై ఓల్టేజ్ స్పై డ్రామా, కార్తి-, ఎస్.జే. సూర్య మధ్య సంఘర్షణతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచేసింది. ఈ చిత్రం సెప్టెంబర్ 10న గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది.










