హైదరాబాద్: చట్టం పాలన మాత్రమే కొనసాగాలని..వ్యక్తుల పాలన కాదని హైకోర్టు స్పష్టం చేసింది. వ్యక్తుల ఆధిపత్యం కొనసాగితే ప్రజాస్వామ్యానికి ప్రమాదమని సూచించింది. శాంతా శ్రీరామ్ కన్ స్ట్రక్షన్ కంపెనీ కేసులో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. బయటకొచ్చిన హైకోర్టు జడ్జిమెంట్ కాపీలో కీలక అంశాలు వెలువడ్డాయి. వ్యక్తి ఆధిపత్యం కొనసాగిందనడానికి ఈ ఘటన ఒక ఉదాహరణ అని తెలిపింది. హైడ్రా కమిషనర్ కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించారన్నది స్పష్టమైందని, వివాదస్పద ఆస్తిలోకి యంత్రాలు, సిబ్బందితో ప్రవేశించడం చట్టవిరుద్ధం అని హెచ్చరించింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ను వీలైనంత త్వరగా బదిలీ చేయాలని సిఎస్ కు సూచనలిచ్చింది. హైడ్రా కమిషనర్ ను తప్పించాలని ఈ నెల 27 న హైకోర్టు ఉత్తర్వులు జారీ చేయనుంది. ఈ మేరకు టాటా మోహన్ రావు కేసులో సుప్రీంకోర్టు ఉత్తర్వులను ప్రస్తావించిన హైకోర్టు శిక్షించడంలో కాకుండా క్షమించడంలోనే చట్ట ఔన్నత్యం ఉందని హైకోర్టు వ్యాఖ్యానించింది.