
హైదరాబాద్: రాష్ట్ర పర్యటనలో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హైదరాబాద్లోని బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున గవర్నర్ శివప్రతావ్ శుక్లా, డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గంలో ప్రధాని హెచ్ఐసిసికి వెళ్లారు. రూ.9,377 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, జాతికి అంకితం చేసే కార్యక్రమాల్లో ప్రధాని పాల్గొననున్నారు. సాయంత్రం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో బిజెపి ఆధ్వర్యంలో నిర్వహించే బహిరంగ సభలో ప్రధాని పాల్గొంటారు. ప్రధాని మోడీ పర్యటన నేపథ్యంలో నగరంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.















