హైదరాబాద్‌లో మంగళవారం సాయంత్రం వేళ పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది. ఉదయం నుంచి కాస్త ఎండగా ఉన్నప్పటికీ సాయంత్రం 5 గంటల తర్వాత ఒక్కసారిగా ఆకాశం నల్లటి మేఘాలతో ముసురుకుని కుండపోతగా వాన కురిసింది. మియాపూర్, కూకట్ పల్లి, రాయదుర్గం, మణికొండ, మాదాపూర్, యూసుఫ్ గూడ, ఖైరతాబాద్, కోఠి, నాచారం, సికింద్రాబాద్, బేగంపేట, అల్వాల్, కాప్రా, మౌలాలీ, జూబ్లీహిల్స్, బోరబండ తదితర ప్రాంతాల్లో భారీ వర్షంతె రహదారులు జలమయమయ్యాయి . ఆఫీసుల నుంచి ఇళ్లకు తిరిగి వెళ్లే పీక్ అవర్స్ సమయంలో వాన పడటంతో  నగరంలోని ప్రధాన కూడళ్లలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.