
హైదరాబాద్: న్యాయవాదిని కారుతో ఢీకొట్టి చంపేసిన సంఘటన హైదరాబాద్ లోని మాసబ్ ట్యాంక్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... శనివారం ఉదయం న్యాయవాది కాజా మోహినుద్దీన్ తన ఇంటి నుంచి బయటకు వచ్చి కారు డోర్ ఓపెన్ చేసి ఎక్కుతున్నాడు. అతివేగంగా వచ్చిన కారు అతడిని ఢీకొట్టింది. అతడు తీవ్రంగా గాయపడడంతో స్థానికులు మోహినుద్దీన్ ను ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతడు మృతి చెందాడని పరీక్షించిన వైద్యులు తెలిపారు. తలకు బలమైన గాయాలు కావడంతో చనిపోయాడని పరీక్షించిన వైద్యులు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భూవివాదాలే హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు.












