హైదరాబాద్:  బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన ఎఫ్ఐఆర్‌ను క్వాష్ చేయాలని రేగా పిటిషన్ వేశారు. తెలంగాణ హైకోర్టు ఇవాళ విచారణ చేపట్టనుంది. ఈ నెల 26న పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో రేగా కాంతారావుపై యువతి ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. యూట్యూబ్ ఛానెల్ పేరుతో ఫ్లాట్‌కు పిలిపించి వేధించారని యువతి ఫిర్యాదులో పేర్కొన్నారు. పెళ్లి పేరుతో లైంగికంగా వేధించారని బాధితురాలు ఆరోపణలు చేసింది.