
ఆమ్‌స్టెల్వీన్(నెదర్లాండ్స్): హాకీ ప్రపంచకప్‌లో భారత మహిళా జట్టు తొలి విజయం నమోదు చేసింది. మంగళవారం సౌతాఫ్రికా విమెన్స్ టీమ్‌తో జరిగిన పూల్‌డి మ్యాచ్‌లో భారత్ 61 గోల్స్ తేడాతో ఘన విజయం సాధించింది. ఒలింపిక్ రజత పతక విజేత చైనాతో జరిగిన ఆరంభ మ్యాచ్‌ను భారత్ 22తో డ్రాగా ముగించిన సంగతి తెలిసిందే. ఇక సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో మాత్రం భారత మహిళలు ఆకాశమే హద్దుగా చెలరేగి పోయారు. ఆరంభం నుంచే దూకుడుగా ఆడుతూ ప్రత్యర్థి జట్టుపై పైచేయి సాధించారు.
11వ నిమిషంలో సునేలిత భారత్‌కు తొలి గోల్ సాధించి పెట్టింది. 17వ నిమిషంలో నవ్‌నీత్ కౌర్, 25వ నిమిషంలో సుశీలా చాను చెరో గోల్ చేయడంతో భారత్ 30 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. సెకండ్ హాఫ్‌లో కూడా భారత్ దూకుడుగా ఆడింది. వరుస దాడులతో ప్రత్యర్థి జట్టును ఉక్కిరిబిక్కిరి చేసింది. 38వ నిమిషంలో దీపిక, 44వ నిమిషంలో లాల్‌రెమ్సియామి, 45వ నిమిషంలో రాణా సాక్షిలు భారత్‌కు గోల్స్ అందించారు. ఇక సౌతాఫ్రికా తరఫున ఏకైక గోల్‌ను కైలా డి వాల్ సాధించింది. ఇక చివరి వరకు ఆధిపత్యం చెలాయించిన భారత్ ఘన విజయం అందుకుంది.








