
ఆమ్‌స్టెల్వీన్(నెదర్లాండ్స్): పురుషుల హాకీ ప్రపంచకప్‌లో భారత్‌కు తొలి ఓటమి ఎదురైంది. సోమవారం జరిగిన గ్రూప్‌డి మ్యాచ్‌లో ఇంగ్లండ్ 4-2 గోల్స్ తేడాతో భారత్‌ను ఓడించింది. ఆట 13వ నిమిషంలో నికోలస్ ఇంగ్లండ్‌కు తొలి గోల్ అందించాడు. అయితే 16వ నిమిషంలో హర్మన్‌ప్రీత్ సింగ్ అద్భుత గోల్‌తో స్కోరును సమం చేశాడు.24వ నిమిషంలో దిల్‌ప్రీత్ సింగ్ భారత్‌కు మరో గోల్ సాధించి పెట్టాడు. దీంతో ప్రథమార్ధంలో భారత్ 21 ఆధిక్యంలో నిలిచింది. కానీ సెకండ్ హాఫ్‌లో ఇంగ్లండ్ అనూహ్యంగా పుంజుకుంది. ఏకంగా మూడు గోల్స్ సాధించి భారత్‌ను కంగుతినిపించింది.











