
ఐపిఎల్‌లో ముంబై ఇండియన్స్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన హార్థిక్ పాండ్యాను ఆ జట్టు వదలుకుంటుందని కొంతకాలంగా చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో ముంబై.. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో సంప్రదింపులు జరిపిందనే వార్తలు బయటకు వచ్చాయి. శివమ్ దూబెతో పాటు.. మరొకరిని తమ జట్టులోకి తీసుకొని ముంబై హార్థిక్‌ను చెన్నైకి ఇచ్చే యోచనలో ఉన్నట్లు తెలిసింది. అయితే ఈ విషయంలో ముంబై ఇండియన్స్ జట్టు కొత్త ట్విస్ట్ ఇచ్చింది. ఎవరితోనూ సంప్రదింపులు జరపలేదని పేర్కొంది.
‘‘మేం ఇప్పుడు పోస్ట్ సీజన్ రివ్యూ నిర్వహిస్తున్నాం. అన్ని కోణాల్లో సమీక్షించి నివేదికను సిద్ధం చేసుకుంటాం. ఇప్పటి వరకైతే ఆటగాళ్ల ట్రేడ్‌కు సంబంధించి ఎలాంటి చర్చలు జరగలేదు. ఎవరితోనూ సంప్రదింపులు చేయలేదు. రివ్యూ పూర్తైన తర్వాతనే ట్రేడింగ్ గురించి ఆలోచిస్తాం. అందుకు ఇంకా సమయం పడుతుంది. తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేం’’ అని ముంబై ఇండియన్స్ ప్రతినిధి స్పష్టం చేశారు.











