
ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్ తన తొలి తెలుగు ఒరిజినల్ కామెడీ సిరీస్ ‘సూపర్ సుబ్బు’ ట్రైలర్‌ను విడుదల చేసింది. మల్లిక్ రామ్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌లో సందీప్ కిషన్, మిథిలా పాల్కర్, మురళీ శర్మ ప్రధాన పాత్రల్లో నటించారు. మల్లిక్ రామ్, రమేష్ ఎలిగేటి, శివాని ధోబాల్ రచించిన ఈ సిరీస్‌ను చిలక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజీవ్ చిలక, భరత్ లక్ష్మీపతి నిర్మించారు. ఈ సిరీస్ జూలై 2 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా సందీప్ కిషన్ మాట్లాడుతూ “సూపర్ సుబ్బు... సాధారణంగా ప్రజలు మాట్లాడటానికి సంకోచించే అంశాన్ని హాస్యం, హృదయానికి హత్తుకునే భావోద్వేగాలతో చెప్పే ప్రయత్నం” అని అన్నారు. ఈ కార్యక్రమంలో మిథిలా పాల్కర్, మురళీ శర్మ, మల్లిక్ రామ్, మానసా చౌదరి, గెటప్ శ్రీను తదితరులు పాల్గొన్నారు.









