
తమిళ, తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్న హీరో శ్రీరామ్ (శ్రీకాంత్) నటిస్తున్న కొత్త సినిమా ‘ది మేజ్‘. ఈ మూవీలో ప్రియాంక, హ్రితిక శ్రీనివాస్, కమల్ కామరాజు ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని డాక్టర్ నైమిష రెడ్డి కసిరెడ్డి సమర్పణలో శ్రౌష కమల ఆర్ట్, యూఆర్ క్రియేషన్స్ బ్యానర్స్ పై డాక్టర్ ఉదయ్ కె. రెడ్డి పాల్వాయి, డాక్టర్ కేఎస్‌ఆర్ (కరెడ్డి శ్రీధర్ రెడ్డి), డాక్టర్ భరత్ రెడ్డి గోపు, డాక్టర్ అనిరుధ్ రెడ్డి సోమ నిర్మిస్తున్నారు. ‘ది మేజ్‘ చిత్రాన్ని సరికొత్త సైకలాజికల్ థ్రిల్లర్ కథతో దర్శకుడు డాక్టర్ రవికిరణ్ గడలాయ్ రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది. తాజాగా ఈ చిత్రం నుంచి హీరో ఆనంద్ దేవరకొండ చేతుల మీదుగా ఫస్ట్ సింగిల్ ’నన్నే నన్నే..’ రిలీజ్ చేశారు. శ్రవణ్ భరద్వాజ్ బ్యూటిపుల్ గా కంపోజ్ చేసిన ఈ పాటకు విజయ్ కుమార్ మంచి సాహిత్యాన్ని అందించారు. కపిల్ కపిలన్ మధురంగా పాడారు. హీరోయిన్ పట్ల హీరో ప్రేమారాధన చూపిస్తూ ఆకట్టుకునేలా సాగుతుంది ఈ పాట.











