చెన్నై: తల్లిదండ్రులతో పోట్లాడి ఓ ట్రాన్స్‌జెండర్‌ను ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రం తిరువళ్లూర్ జిల్లా ఆవడి ప్రాంతంలో జరిగింది. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.... మోరై గ్రామానికి చెందిన ప్రవీణ్ రాజ్ అనే యువకుడు చెన్నైలోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. కయల్ విళి అనే ట్రాన్స్‌జెండర్ సోషల్ మీడియాలో పరిచయం కావడంతో ప్రేమగా మారింది. ఇద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రవీణ్ రాజు తల్లిదండ్రులు ఈ పెళ్లికి అంగీకరించలేదు. దీంతో ప్రవీణ్ రాజ్ సదరు ట్రాన్స్‌జెండర్‌తో సహజీవనం చేస్తున్నాడు. ఈ విషయం తల్లిదండ్రులకు తెలియడంతో కుమారుడిని తన దారిలో తీసుకరావాలని నిర్ణయం తీసుకున్నారు. పండుగకు ఇంటికి వచ్చిన కుమారుడికి బలవంతంగా మత్తు పదార్థాల పునరావాస కేంద్రంలో చేర్పించారు. మే నెలలో తాను కోలుకున్నానని చెప్పడంతో అతడిని ఇంటికి తీసుకొచ్చి మరో యువతితో పెళ్లి చేస్తుండగా అక్కడి నుంచి తప్పించుకున్నారు. కయల్‌విళితో కలిసి గోపిచెట్టిపాలయంలోని ఓ న్యాయ సహాయ కేంద్రానికి చేరుకొని తనకు జరిగిన అన్యాయం గురించి చెప్పారు. వెంటనే ఇద్దరికి నిర్వహకులు పెళ్లి చేశారు.