
పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులతో హజ్ యాత్ర భారంగా మారిన నేపథ్యంలో యాత్రికులపై పడే భారాన్ని భరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ నుంచి ప్రతి ఏటా పిలిగ్రిమ్స్ పెద్ద సంఖ్యలో మక్కాకు హజ్ యాత్రకు వెళతారు. ఈ ఏడాది సుమారు 7 వేల మంది హజ్ యాత్రకు నమోదు చేయించుకున్నారు. పేద ముస్లింలు సైతం తమ జీవితకాలంలో ఒక్కసారైనా హజ్‌కు వెళ్లాలనే లక్ష్యంతో ప్రతి రూపాయి జాగ్రత్తగా దాచుకుంటారు. ఆ మొత్తాన్ని ఉపయోగించుకొని హజ్ యాత్రకు వెళుతుంటారు. కాని ఇరాన్-, అమెరికా యుద్ధంతో ఇంధన ధరలు పెరగడంతో ఆ ప్రభావం హజ్ యాత్రపై పడి యాత్రికులపై భారం పెరిగింది. కేంద్ర హజ్ కమిటీ ప్రతి యాత్రికుడు అదనంగా రూ. 10 వేలు చెల్లించాలని సర్కులర్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హజ్ యాత్రికుల భారం భరించాలని నిర్ణయం తీసుకున్నారు.












