
హన్మకొండలో ని కిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో కేంద్ర నైపుణ్యాభివృద్ధి, వ్యవసాయాధారిత వ్యవస్థాపకత మంత్రి త్వశాఖ, నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కా ర్పొరేషన్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్రీయ లోక్‌దళ్ రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ఎంఎల్‌సి కపిలవాయి దిలీప్ కుమార్ తెలిపారు. హన్మకొండలో ఆయన బు ధవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ జాబ్ మేళా లో ఐటి, ఫార్మాస్యూటికల్స్, ఆ టోమొబైల్, హెల్త్‌కేర్, బ్యాంకింగ్ తదితర రం గాలకు చెందిన 100కు పైగా ప్రముఖ సంస్థలు పాల్గొంటున్నా యని వెల్లడించారు. శనివారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గం టల వరకు వాక్‌ఇన్‌ఇంటర్వూలు నిర్వహిస్తారని, వరంగల్, పరిసర జిల్లాల నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ జాబ్ మేళాలో పాల్గొనడానికి ఎటువంటి రుసుము లేదని వెల్లడించా రు.
ఈ కార్యక్రమాన్ని మంత్రి సీతక్క, వరంగల్ ఎంపి కడియం కావ్య, ఎంఎల్‌సి చింతపండు న వీన్ కుమార్ (తీన్మార్ మల్లన్న), తెలుగు అకాడమి చైర్మన్ మాజీ పార్లమెంట్ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంతారావు, వర్ధన్నపేట ఎంఎల్‌ఎ కె.నాగరాజు, ఎంఎల్‌ఎ నా యిని రాజేందర్‌రెడ్డి తదితర ప్రముఖులు పాల్గొని ప్రారంభించనున్నట్లు తెలిపారు. అదే విధంగా అవినీతి రహిత సమాజ నిర్మాణ లక్షంతో ‘లక్షం కోసం లక్ష సైన్యం’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమం ద్వారా రిటైర్డ్ ఆర్మీ అధికారులు, మాజీ సైనికులు, దేశభక్తి భావాలు కలిగిన యువతను సమీకరించి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రీ య లోక్ దళ్ అధికార ప్రతినిధి గౌర బీరప్ప మాట్లాడుతూ రానున్న నల్గొండవరంగల్‌ఖమ్మం పట్టభద్రుల ఎంఎల్‌సి నియోజక వర్గ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రీయ లోక్‌దళ్ తరపున కపిలవాయి దిలీప్‌కుమార్ పోటీ చేయనున్నట్లు ప్రకటించారు.
గతంలో ఆయన విజయానికి సహకరించిన భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ), భారత కమ్యూనిస్టు పార్టీ (మార్కిస్టు) (సిపిఎం), భారత జాతీయ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ, బిఆర్‌ఎస్ పార్టీలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ రానున్న ఎన్నికల్లో ఆయా రాజకీయ పార్టీల సహకారం, మద్దతు కోరుతున్నట్లు తెలిపారు. సమావే శంలో టిఆర్‌ఎల్‌డి వరంగల్ జిల్లా అధ్యక్షులు రాంప్రసాద్, టిఆర్‌ఎల్‌డి యువజన విభాగం అధ్యక్షులు రాజ్‌కుమార్ రెడ్డి, టిఆర్‌ఎల్‌డి సాంస్కృ తిక విభాగం అధ్యక్షులు బుల్లెట్ వెంకన్న, టిఆర్‌ఎల్‌డి రాష్ట్ర కోశాధికారి గిరి కుందే, రాష్ట్ర కార్యదర్శి కోటి, ప్రధాన కార్యదర్శి నరసింహారావు తదితర టిఆర్‌ఎల్‌డి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.












