
కరీంనగర్: హుస్నాబాద్ పట్టణంలోని 250 పడకల ఆసుపత్రి నిర్మాణ పనులను మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించడంతో పాటు పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ, ఎలాంటి జాప్యం లేకుండా నిర్దేశిత సమయంలోగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు పొన్నం ఆదేశించడం జరిగింది. హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలకు మెరుగైన, ఆధునిక వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ఆసుపత్రి నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేసేలా నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. నిర్మాణ పనుల నాణ్యత, వేగం, ప్రమాణాలపై అధికారులకు పలు సూచనలు చేశారు.











