మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ లో భాగంగా ఇంగ్లాండ్ జట్టుతో జరుగుతున్న తొలి వన్డేలో భారత బౌలర్లు రాణించారు.ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. మొదట శుభారంభాన్ని అందుకున్న ఇంగ్లాండ్ జట్టు.. తర్వాత టీమిండియా బౌలర్లు లైన్ అండ్ లెంగ్త్ బంతులతో కట్టుదిట్టమైన బౌలింగ్ వేయడంతో వరుస వికెట్లు కోల్పోయింది. ఓ క్రమంలో 80 పరుగులకే 5 కీలక వికెట్లు కోల్పోయింది. ఈ క్రమంలో జో రూట్(76 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు.

ఓ వైపు సహచర ఆటగాళ్లు పెవిలియన్ కు క్యూ కడుతున్నా.. రూట్, స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. డాసున్(68)తో విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వీరిద్దరూ కొంతసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకుని పరుగులు రాబట్టారు. అర్ధశతకాలతో రాణించిన వీరద్దరూ ఏడో వికెట్ కు 121 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని అందించారు. అయితే, మిగతావారు విఫలమవడంతో ఇంగ్లాండ్‌ 258 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో అక్షర్ పటేల్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. ప్రసిధ్ క్రిష్ణ, గుర్నూర్ లు చెరో రెండు వికెట్లు.. బుమ్రా, శివమ్ దూబే ఒక్కో వికెట్ తీశారు.