భారత చైనామెన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ ఇంగ్లండ్ గడ్డపై మాయాజాలం సృష్టిస్తున్నాడు. అద్భుతమైన బౌలింగ్‌తో బ్యాట్స్‌మెన్‌లకు చుక్కలు చూపిస్తున్నడు. అక్కడ జరుగుతున్న వన్డే కప్‌లో ఇప్పటివరకూ మూడు మ్యాచులు ఆడిన అతడు ఆరు వికెట్లు తీశాడు. టోర్నీలో తొలి మ్యాచ్‌లో గ్లామోర్గన్‌పై 10 ఓవర్లలో 39 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. రెండో మ్యాచ్‌లో సస్సెక్స్‌పై 6.5 ఓవర్లలో 58 పరుగులు ఇచ్చి మరో రెండు వికెట్లు తీశాడు. ఆ తర్వాత వోర్సెస్టర్‌షైర్‌పై కేవలం 34 పరుగులు ఇచ్చి మరో రెండు వికెట్లు తీశాడు. దీంతో కుల్దీప్ ప్రాతినిథ్యం వహిస్తున్న యార్క్‌‌షైర్ జట్టు విజయాలతో దూసుకుపోతుంది.