
మంచిర్యాల జిల్లా మందమర్రిలో భారీ కొండచిలువ కలకలం రేపింది. గ్యాస్ గోదాం సమీపంలో ఓ ఇంటి ఆవరణలోకి సుమారు 12 అడుగులున్న కొండచిలువ వచ్చింది. దీంతో భయాందోళనకు గురైన కుటుంబ సభ్యులు వెంటనే స్నేక్ క్యాచర్‌కు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న స్నేక్ క్యాచర్ మహేందర్ అతి కష్టం మీద కొండచిలువను పట్టుకున్నారు. ఆ తర్వాత దాన్ని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు.











