
శ్రీనగర్: యాత్రికులు అమర్‌నాథ్ నుంచి తిరిగొస్తుండగా బస్సులో ఇంటిపై పడిన సంఘటన జమ్ము కశ్మీర్ రాష్ట్రం గాందర్ బల్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... కంగన్ శివారులో బస్సు అదుపుతప్పి ఓ ఇంటిపై పడింది. బస్సులో పడినప్పుడు ఇంట్లో ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఇల్లు లేకపోయి ఉంటే బస్సు సింధు నదిలో పడేదని సమాచారం. 39 మంది క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. మంగళవారం తెల్లవారుజామున అమర్‌నాథ్ యాద్రకు 3029 మంది యాత్రకులు బయలుదేరారు. జులై 3 నుంచి ఆగస్టు 28 వరకు అమర్‌నాథ్ యాత్ర కొనసాగనుంది. సోమవారం అమర్‌నాథ్‌ను 4.2 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు. 2024లో 5.2 లక్షలు, 2025లో 4.14 లక్షలు, 2011లో 6.3 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు.











