టెహరాన్: ఇరాన్ సుప్రీం నేత అయాతుల్లా ఖమేనీ అంత్యక్రియలకు ఓ ముసుగు వ్యక్తి హాజరు అయ్యాడు ప్రధాన వ్యక్తుల వెనుక వరుసలో చాలా సేపటి వరకూ కన్పించిన ఈ ముసుగు వ్యక్తి ఎవరనేది ఇప్పుడు చర్చకు దారితీసింది. అంతిమ ప్రార్థనల దశలో ముందు వరుసలో కూర్చున్న వ్యక్తి నల్లటి ముసుగుతో , నల్లటి బ్లాక్‌బేస్ క్యాప్‌తో ఉన్నాడని గుర్తించారు. అంత్యక్రియలలో పసిబిడ్డ శవపేటికను కూడా ఈ వ్యక్తి కాసేపు మోసి వెళ్లాడు.

ఇజ్రాయెల్ బెదిరింపులతో ఖమేనీ కుమారుడు ఇప్పటి సుప్రీం నేత మొజ్తబా నేరుగా చివరి ఘట్టానికి రాలేదని, ముసుగు ధరించి వచ్చి వెళ్లాడని ఇప్పుడు ఇరాన్ వార్తాసంస్థ ఒకటి తెలిపింది. మొజ్తబా తీవ్రంగా గాయపడి ఇంకా కోలుకోలేదని, ముఖంపై గాయాలతో ముసుగు ధరించి వచ్చి ఉంటాడని ప్రచారం జరుగుతోంది. అయితే ముసుగులో కన్పించింది ఖమేనీ పెద్ద మనవడు జావెద్ అని, అప్పటి దాడిలో ఆయన ముఖం కాలిపోయిందని, తీవ్రంగా గాయపడ్డాడని, దీనితో మాస్క్‌తో వచ్చాడని ఇరాన్‌కు చెందిన ఓ అంతర్జాతీయ పత్రిక తెలిపింది.,