
దుబాయ్ : ఇరాన్‌అమెరికా మధ్య హార్ముజ్ జలసంధిపై నియంత్రణ కోసం వరుసగా దాడులు సాగుతున్నాయి. మంగళవారం ఉదయం జలసంధి లోని ట్యాంకర్‌పై ఇరాన్ దాడి చేసింది. ఆ ట్యాంకర్‌ను సిబ్బంది విడిచిపెట్టేలా ఒత్తిడి తెచ్చింది. అయితే జలసంధిపై గట్టి పట్టున్న ఇస్లామిక్ రిపబ్లిక్‌ను టార్గెట్ చేసుకుని అమెరికా పదోసారి దాడులు చేసింది. అయినా జలసంధిపై ఇరాన్ పట్టును సడలించలేకపోయింది.
ఇరాన్ మిలిటరీ స్థావరాలపైన, సాగర సామర్థాలపైన, క్షిపణులు, డ్రోన్లు ప్రయోగ క్షేత్రాలపైన, వైమానిక రక్షణ వ్యవస్థలపైన వరుసగా దాడులు చేసినట్టు అమెరికా మిలిటరీ సెంట్రల్ కమాండ్ మంగళవారం వెల్లడించింది. దాడులకు సంబంధించిన ఫుటేజీని విడుదల చేసింది. నావికా సిబ్బందిపై అనవసరంగా దాడులు చేయడాన్ని ఉద్దేశిస్తూ , హార్ముజ్ జలసంధి ద్వారా స్వేచ్ఛగా రవాణాజరిగేలా వీలు కల్పించేందుకు ఇరాన్‌ను జవాబుదారీ చేయాలన్నదే తమ లక్షంగా అమెరికా మిలిటరీ సెంట్రల్ కమాండ్ వెల్లడించింది.
కువాయిట్‌పై మళ్లీ ఇరాన్ దాడులు
కువాయిట్ లోని విద్యుత్ ,డిశాలినేషన్ ప్లాంట్లపై ఇరాన్ మళ్లీ దాడులు చేసిందని కువాయిట్ మంగళవారం వెల్లడించింది. ఈమేరకు కువాయిట్ ఎలక్ట్రిసిటీ, వాటర్, రెన్యుబల్ ఎనర్జీ మంత్రిత్వశాఖ ప్రకటించింది. ఈ విధంగా నాలుగోసారి ఈ దాడులు సోమవారం రాత్రి జరిగాయి. ప్లాంట్లు మంటలపాలై విపరీత నష్టం వచ్చిందని పేర్కొంది. కువాయిట్‌కు 90 శాతం మంచినీరు సరఫరా డిశాలినేషన్ ప్లాంట్ల నుంచే వస్తుంది.
పికాక్స్ పర్వతం వద్దకు అణుసెంట్రిఫ్యూజ్‌ల తరలింపు
ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేయకుండా నిరోధించేందుకు అమెరికాఇజ్రాయెల్ చేస్తోన్న ప్రయత్నాలు ఫలించడం లేదు. ఇరాన్ వేలాదిగా అణు సెంట్రిఫ్యూజ్‌లను పికాక్స్ పర్వతం వద్దకు తరలించి, వాటిని భూమి లోతుల్లో పాతి పెట్టిందని ఇజ్రాయెల్ నిఘా వర్గాలు తెలిపాయి. వైమానిక దాడుల్లో వాటిని లక్షంగా చేసుకోవడం కష్టతరంగా మారుతోందని పేర్కొన్నాయి. 2025 జూన్‌లో 12 రోజుల పాటు ఇరాన్‌పై అమెరికా ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించాయి. ఆ తర్వాతే సెంట్రిఫ్యూజ్‌ల తరలింపు జరిగినట్టు సమాచారం.











