మాస్ మహరాజ రవితేజ నటించిన లేటెస్ట్ చిత్రం ‘ఇరుముడి’. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా శుక్రవారం విడుదలై ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా చూసిన ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ మూవీ ప్రత్యేకమని ఆయన కొనియాడారు. ఈ సినిమా మీ అంతరాత్మను చాలా లోతుగా టచ్‌ చేస్తుందని తెలిపారు. ఈ కథ ఒక స్వచ్ఛమైన భావోద్వేగం, భక్తితో జరుపుకునే వేడుక అని సందీప్ ప్రశంసించారు. మాస్ మహరాజా రవి తేజ, బేబీ నక్షత్ర, శివ నిర్వాణ మనల్ని ఒక మరపురాని భావోద్వేగ ప్రయాణంలోకి తీసుకు వెళ్తారని ట్వీట్ చేశారు. ఈ మూవీ తప్పకుండా చూడాలని అభిమానులను కోరారు. సూపర్ హిట్ సాధించిన చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు.