చాలాకాలం గ్యాప్ తర్వాత మాస్ మహరాజ రవితేజ ‘ఇరుముడి’ సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నారు. భక్తి, కూతురి సెంటిమెంట్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఆడియన్స్‌ని మంత్రముగ్దుల్ని చేసింది. సినిమా రిలీజై పది రోజులు దాటినా సరే చాలా చోట్ల హౌస్‌ఫుల్ బోర్డులు కనిపించాయి. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటించగా.. రవితేజ కూతురి పాత్రలో బేబీ నక్షత్ర నటించింది.

కాగా, జివి ప్రకాశ్ అందించిన మ్యూజిక్ సినిమాని వేరే లెవల్‌కు తీసుకెళ్లింది. సినిమాలో ప్రతీ పాట ప్రేక్షకులను అలరించాయి. తాజాగా ఈ మూవీలోని అయ్యప్ప భక్తి పాట ‘ఇరుముడి కట్టు’ పూర్తి వీడియో సాంగ్‌ని విడుదల చేశారు. అయ్యప్ప దీక్ష తీసుకునే క్రమంలో ఈ సాంగ్ ఉంటుంది. ఇందులో అయ్యప్ప భక్తుల నృత్యంతో పాటు రవితేజ-పాప కలిసి డ్యాన్స్ చేస్తారు. ఇకపోతే ‘ఇరుముడి’ ఇప్పటికే రూ.150+ కోట్లు వసూళు చేసినట్లు నిర్మాతలు ప్రకటించారు. సినిమాకి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే త్వరలోనే రూ.200 కోట్ల మార్క్ చేరుకునే అవకాశం ఉంది.