
జాతీయ ఉత్తమ నటులుగా మమ్ముట్టి, కార్తిక్ ఆర్యన్
జాతీయ ఉత్తమ చిత్రంగా ఆర్టికల్ 370
ఉత్తమ దర్శకుడిగా రాజ్‌కుమార్ పెరియాసామి
జాతీయ ఉత్తమ ప్రజాదరణ చిత్రంగా ‘కల్కి 2898 ఏడీ’
72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రకటన
భారతీయ చలనచిత్ర రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2024 సంవత్సరంలో విడుదలైన వైవిధ్యభరితమైన 400లకు పైగా చిత్రాలు జ్యూరీ ముందుకు రాగా, వాటిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు కేంద్ర సమాచార ప్రసార శాఖ ఈ అవార్డులను అధికారికంగా ప్రకటించింది. ప్రముఖ సౌత్ ఫిల్మ్‌మేకర్ జయరాజ్ జ్యూరీ ఛైర్మన్‌గా వ్యవహరించిన ఈ అవార్డులలో జాతీయ ఉత్తమ చిత్రంగా ఆర్టికల్ 370 (హిందీ) నిలిచింది.
ఇక జాతీయ ఉత్తమ నటుడిగా మమ్ముట్టి (భ్రమయుగం), కార్తిక్ ఆర్యన్ (చందూ ఛాంపియన్) సంయుక్తంగా ఎంపికయ్యారు. ఉత్తమ నటిగా యామి గౌతమ్ (ఆర్టికల్ 370), ఉత్తమ దర్శకుడిగా రాజ్‌కుమార్ పెరియాసామి (అమరన్)లను జాతీయ అవార్డులు వరించాయి. ఇక ఉత్తమ తెలుగు చిత్రంగా ’కమిటీ కుర్రోళ్లు’ ఈ అవార్డుకు ఎంపికైంది. జాతీయ ఉత్తమ ప్రజాదరణ చిత్రంగా ‘కల్కి 2898 ఏడీ’ (దర్శకుడు నాగ్ అశ్విన్), ఉత్తమ బాలల చిత్రంగా చిన్న కథ కాదు (దర్శకుడు నందకిషోర్) అవార్డులు దక్కాయి. ఉత్తమ మేకప్ పి.రవికుమార్ (కమిటీ కుర్రోళ్లు), ఉత్తమ కాస్టూమ్ డిజైనర్‌గా దీపాలి నూర్, శీతల్ శర్మ (పుష్ప 2) , ఉత్తమ ప్రొడక్షన్ డిజైనర్‌గా నితిన్ జిహానీ చౌదరి (కల్కి 2898 ఏడీ), ఉత్తమ స్క్రీన్‌ప్లే (సంభాషణలు) వెంకీ అట్లూర్ (లక్కీ భాస్కర్), ఉత్తమ స్క్రీన్‌ప్లే రచయిత (ఒరిజినల్) సుకుమార్- (పుష్ప 2)లను ఈ అవార్డులు వరించాయి.
జాతీయ అవార్డుల విజేతల జాబితా...
ఉత్తమ చిత్రం : ఆర్టికల్ 370 (హిందీ)
-ఉత్తమ నటులు : మమ్ముట్టి (భ్రమయుగం- - మలయాళం), కార్తీక్ ఆర్యన్ (చందూ ఛాంపియన్- -- హిందీ)
ఉత్తమ నటి : యామీ గౌతమ్ (ఆర్టికల్ 370 -- హిందీ)
ఉత్తమ దర్శకుడు : రాజ్‌కుమార్ పెరియసామి (అమరన్ -- తమిళ్)
ఉత్తమ సహాయ నటుడు : సంజయ్ మిశ్రా (భక్షక్-హిందీ)-
ఉత్తమ సహాయ నటి : రూపశ్రీ వర్కాడే (మిథ్య - కన్నడ),- సచినా నమిదాస్ (మహారాజా- తమిళ్)
ఉత్తమ బాలల చిత్రం- ః 35 చిన్న కథ కాదు (తెలుగు)
ఉత్తమ జాతీయ విలువ చిత్రం ః- కెప్టెన్ మిల్లర్ (తమిళ్)
ఉత్తమ జాతీయ ప్రజాదరణ చిత్రం ః కల్కి 2898 ఏడీ (నాగ్ అశ్విన్)
ఉత్తమ తొలి చిత్ర దర్శకుడు ః రణ్‌దీప్ హుడా (స్వాతంత్య్ర వీర్ సావర్కర్)
ఉత్తమ సంగీత దర్శకుడు (పాటలు):శశ్వాంత్ సచ్‌దేవ్ (ఆర్టికల్ 370)-
ఉత్తమ సంగీత దర్శకుడు (నేపథ్యం): జీవీ ప్రకాష్ కుమార్ (అమరన్)
ఉత్తమ ఛాయాగ్రహణం : హెహనాద్ జలాల్ (భ్రమయుగం)
ఉత్తమ కూర్పు : ఆర్.కలైవనన్ (అమరన్) -
ఉత్తమ యాక్షన్ డైరెక్షన్ : అనల్ అరసు (మహారాజ- తమిళ్)
ఉత్తమ కొరియోగ్రఫీ ః విజయ్ గంగూళీ (స్త్రీ 2 - హిందీ)
ఉత్తమ గేయరచన ః మనోజ్ ముంతాషిర్ (జానేదో- మైదాన్)
ఉత్తమ మేకప్: కమిటీ కుర్రోళ్లు (పి. రవికుమార్)
ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్: దీపాల్ నూర్, శీతల్ శర్మ (పుష్ప 2)
ఉత్తమ ప్రొడక్షన్ డిజైనర్: నితిన్ జిహానీ చౌదరి (కల్కి 2898 ఏడీ)
ఉత్తమ స్క్రీన్‌ప్లే, డైలాగ్ రైటర్: వెంకీ అట్లూరి (లక్కీ భాస్కర్)-
ఉత్తమ స్క్రీన్‌ప్లే రచయిత (ఒరిజినల్) ః సుకుమార్- (పుష్ప 2)-
ఉత్తమ ప్లేబ్యాక్ సింగర్ (ఫిమేల్)ః- వైకోమ్ విజయలక్ష్మి(ఏఆర్‌ఎం)
ఉత్తమ ప్లేబ్యాక్ సింగర్ (మేల్)- ః అభయ్ జోధ్‌పుర్కర్ (గరాత్ గణపతి)
ఉత్తమ బాలనటుడు : - అతిష్ శెట్టి (మిథ్య- కన్నడ)
ఉత్తమ బాలనటుడు: - అరుణ్ దేవ్ పోతుల (35 చిన్న కథ కాదు - తెలుగు)
ఉత్తమ తెలుగు చిత్రం ః కమిటీ కుర్రోళ్లు
-----------------------------------------------------------------------------------------------------











