గ్లాస్గో: కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో భాగంగా జరిగిన జావెలిన్ త్రో ఫైనల్స్‌లో స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రాతో పాటు మరో ఇద్దరు భారత అథ్లెట్లు అర్హత సాధించారు. నీరజ్ చోప్రా 79.61 మీటర్లు, రోహిత్ యాదవ్ 78.37 మీటర్లు, యశ్ వీర్ సింగ్ 78.36 మీటర్ల దూరం విసిరారు. ఫైనల్ శుక్రవారం రాత్రి 10.15 గంటలకు ప్రారంభం అవుతుంది.

డైరెక్ట్ క్వాలిఫికేషన్ మార్క్(84 మీటర్లు)ను ఎవరూ అందుకోలేకపోయారు. గ్లాస్గోలో బలమైన గాలులతో కూడిన వాతావరణం అథ్లెట్లకు ప్రతికూలంగా మారింది. అత్యుత్తమంగా శ్రీలంకకు చెందిన రుమేశ్ తరంగ పతిరగె 82.84 మీటర్లు విసిరి అగ్రస్థానంలో నిలిచారు. అండర్సన్ పీటర్స్ (81.29 మీ, గ్రెనెడా), డౌ స్మిత్ (80.64 మీ, సౌతాఫ్రికా), బెన్ ఈస్ట్ (80.38 మీ, ఇంగ్లండ్) వరుసగా ఆ తర్వాతి స్థానాల్లో నిలిచారు. నీరజ్ ఐదో స్థానంలో నిలవగా.. రోహిత్ యాదవ్ తొమ్మిది, యశ్ వీర్ సింగ్ పదోస్థానంలో నిలిచారు. పాక్ అథ్లెట్ అర్షద్ నదీమ్ (78.63 మీ) ఏడో స్థానంలో నిలిచాడు.