కుత్బుల్లాపూర్: మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగలు బీభత్సం సృష్టించారు. టిఎస్‌ఐఐసిలో ఓ కిరాణాషాపులో దొంగలు పడ్డారు. రూ.30 వేల నగదు, రూ.50 వేల విలువ చేసే సిగరేట్ డబ్బాలను ఎత్తుకెళ్లారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. సిసిటివి ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.