
న్యూఢిల్లీ: నీట్ యూజి పేపర్ లీక్ కు నిరసనగా కాక్రోచ్ జనతా పార్టీ(సిజెపి) సోమవారం 'చలో పార్లమెంట్' ర్యాలీ చేపట్టింది. దీంతో ఢిల్లీలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జె.పి. నడ్డాను సిజెపి ప్రతినిధులు కలిశారు. ఈ సందర్భంగా తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ లేఖ అందించారు. నీట్ పరీక్షలో జరిగిన అక్రమాల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని తమ డిమాండ్‌ను పునరుద్ఘాటించారు.
ఈ మీటింగ్ అనంతరం ఎక్స్ వేదికగా సిజెపి ప్రతినిధి సౌరవ్ దాస్.. తమ డిమాండ్లను పరిశీలిస్తామని నడ్డా హామీ ఇచ్చారని తెలిపారు. "నేను, అశుతోష్ రంకా మధ్యాహ్నం 12 గంటలకు జె.పి. నడ్డా నివాసంలో ఆయనను కలిశాము. ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలి లేదా పదవి నుంచి తొలగించాలి అనే అంశంతో సహా మా డిమాండ్లన్నింటినీ ఆయనకు తెలియజేశాము. దీనిపై తగిన స్థాయిలో చర్చిస్తానని మంత్రి మాకు హామీ ఇచ్చారు. అయితే, ఇప్పటివరకు ఎటువంటి నిర్దిష్ట హామీలు లభించలేదు. మా డిమాండ్లు నెరవేరే వరకు శాంతియుత నిరసనలు కొనసాగుతాయి" అని దాస్ అన్నారు.
ప్రధానంగా మూడు డిమాండ్లతో కూడిన లేఖను దాస్ ఎక్స్ వేదికగా పంచుకున్నారు. విద్యాశాఖ మంత్రి ప్రధాన్ రాజీనామా చేయాలన్నది వారి మొదటి ప్రధాన డిమాండ్. అలాగే, సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో చేరిన కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్‌ను విడుదల చేయాలని, ఆయన కదలికలపై ఎటువంటి ఆంక్షలు ఉండకూడదని కూడా వారు డిమాండ్ చేశారు. వీటితో పాటు, ప్రశ్నపత్రం లీక్ అయిన తర్వాత ఆత్మహత్య చేసుకున్న NEET అభ్యర్థులందరికీ రూ. 1 కోటి పరిహారం చెల్లించాలని కూడా సిజెపి డిమాండ్ చేసింది. నడ్డాతో సమావేశం సందర్భంగా.. సొ నిరసనకారులపై ఢిల్లీ పోలీసులు బలప్రయోగాన్ని ఆపాలని దాస్ కోరారు.
కాగా, సోనమ్ వాంగ్‌చుక్ పార్లమెంట్ ముట్టడి పిలుపు మేరకు భారీగా విద్యార్థులు తరలివచ్చారు. దీంతో పార్లమెంట్ ముట్టడిని అడ్డుకునేందుకు పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. అయినా విద్యార్థులు దూసుకురావడంతో పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. టియర్ గ్యాస్ ఉపయోగించి విద్యార్థులను వెనక్కి పంపేందుకు ప్రయత్నించగా ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. పలువురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. విద్యార్థులపై పోలీసులు లాఠీ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
'X'











